బి.ఎస్.ఎన్.ఎల్ లో లక్ష మందికి స్వచ్చంద పదవీ విరమణ

సెప్టెంబరు 27, 2011

బి.ఎస్.ఎన్.ఎల్ లో లక్ష మందికి స్వచ్చంద పదవీ విరమణ
సెప్టెంబర్ 27 న ధర్నా, అక్టోబర్ 10 న సమ్మె ఉద్యోగులు
2009 లో 3,97,000 మంది ఉద్యోగులుండేవాళ్ళు. ప్రస్తుతం 276,000 మంది పనిచేస్తున్నారు. అంటే లక్షా ఇరవై వేలమందికి పైగా తగ్గారు. కారణం రిటైరైన వాళ్ళ స్తానంలో నియామకాలు నిలపటమే. అయినా ఇది ప్రభుత్వానికి చాలలేదు. మరో లక్షమందిని ఇంటికి పంపాలని మంకుపట్టుతో ఉంది. 2000 నుంచీ 2009 దాకా లాభాలలోనే నడిచింది. తొలిసారి 2009-2010 సంవత్సరంలో ప్రభుత్వ విధానాల మూలంగా 1823 కోట్లు నష్టం నమోదు చేసింది. 2010-2011 లో నష్టం 6384 కోట్లు. ఉద్యోగుల జీతాల వల్లే నష్టాలంటూ ప్రభుత్వమూ, యాజమాన్యమూ ప్రచారం చేస్తున్నాయి. 2009-2010 లో ఆదాయంలో 42 శాతం జీతాలకి ఖర్చయిందనీ, 2010-11 లో 46.5 శాతం అనీ ,ప్రైవేట్ కంపెనీలకి 5శాతం మాత్రమే అవుతుందనీ వాదన. ప్రస్తుతం 49 శాతం అని ఆర్.కే. ఉపాధ్యాయ బి.ఎస్.ఎన్.ఎల్ చైర్మన్ 2011 ఆగస్ట్ చివరలో ప్ర ప్రకటించాడు . ఇదే పెద్ద సమస్య అన్నాడు. ఎయిర్‌టెల్ లో 25,000 మంది మాత్రమే పనిచేస్తున్నారనీ, పైగా ఆసంస్తకి బీ.ఎస్.ఎన్.ఎల్ కన్నా ఎక్కువమంది వినియోగదారులు ఉన్నారనీ కనక ఇందులో ఉద్యోగుల్ని తగ్గించాలనీ పట్టుబడుతున్నారు.
45 ఏళ్ళు నిండిన వాళ్ళు అర్హులు. ఒక లక్షమందికి ఈప్రతిపాదన వర్తిస్తుంది. మొత్తం ఖర్చు 20,802 కోట్లు.ఇందులో బి.ఎస్.ఎన్.ఎల్ వాటా 2705 కోట్లు. పోగా 18,097 కోట్లు డాట్ వాటా. ఒక ఉద్యోగికి సగటున వచ్చేది 20.8 లక్షలు. పనిచేసిన సంవత్సరానికి రెణ్ణెల్ల జీతం చొప్పున వచ్చే మొత్తం గానీ, మిగిలిన సర్వీసుకు రావలసిన జీతం మొత్తం గానీ – రెంటిలో ఏది తక్కువయితే అది వస్తుంది. మీకిది లాభదాయకం అంటూ ఉద్యోగుల్ని ఊరిస్తున్నది. శాం పిట్రోడా సిఫారస్ ప్రకారం లక్షమందిని తగ్గించాలని ప్రభుత్వ పట్టుదల.
సరే లక్షతొ ఆగుతుందా? ఎయిర్ టెల్ 25000 మందితో నడుస్తున్నప్పుడు బి.ఎస్.ఎన్.ఎల్ ఎందుకు నడవదు, అనేది తర్వాత ప్రస్న కాదా? 25 వేలకి కుదించే కార్యక్రమం అంచెలంచెలుగా కొనసాగదని గారెంటీ ఏమిటి? అలా చేసినా చాలదు. పోటీ సంస్తకి లాగే జీతాల ఖర్చు 5 శాతాని తేవాలనే కోరిక పుట్టదా? చౌకగా దొరికే వాళ్ళతో పనిచేయించుకుని లాభాలు దండుకునే ప్రైవేట్ యజమానుల దుష్ట వాంఛ ప్రబుత్వాల తలకెక్కింది.
ఇష్టమైన వాళ్ళు పదవీవిరమణ పధకాన్ని వినియోగించుకోవచ్చు. బలవంతం లేదు అని యాజమాన్యం అంటున్నది కాని దాని లోగుట్టు, ఆంతర్యం ఉద్యోగులకు తెలుసు. ఇతర దేశాల్లో ఎమిజరిగిందో గమనించారు.యూనియన్లు సరే అంటే చాలు. సుదూర ప్రాంతాలకి బదిలీ చేసి లొంగేట్టు చేసిన సందర్భాలు విదేశీ టెలికాం రంగంలో లెక్కకు మించి ఉన్నాయి.
నయానో, భయానో ఇళ్ళకుపంపి సంస్తని ప్రైవేటు కంపెనీలకి అమ్మాలనేది ఆంతర్యం. ఆ కంపెనీలనుంచి భారీస్తాయిలో ముడుపులు దండుకోవటం తెలిసిందే. పైగా సంస్తకి భారీస్తాయిలో భూములున్నాయి. వాటిని ప్రైవేటుకి చౌకగా కట్టబెట్టి అంతులేని అవినీతికి పాల్పడలన్నదే పాలకుల కోరిక. ఆఆశతోనే ఇందుకొడిగడతున్నారు.
ఈదుష్ట పధకాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందరూ కలిసి సెప్టెంబర్ 27 న ధర్నా చేశారు. అక్టోబర్ 10 న సమ్మే చేయబోతున్నారు. ఉద్యోగులు విజయం సాధించాలని అందరం కోరుకుందాం. సహకరిద్దాం.

అంతర్యుద్ధం నుంచి యుద్ధం స్థాయికి

సెప్టెంబరు 19, 2011

అంతర్యుద్ధం నుంచి యుద్ధం స్థాయికి

తిరగబెడుతున్న (మరొక) మాంద్యం

సెప్టెంబరు 11, 2011

తిరగబెడుతున్న (మరొక) మాంద్యం

‘చౌక’ వైద్యమా? ‘చౌకబారు’ వైద్యమా?

జూన్ 16, 2011

“చౌక (బారు) చికిత్స కోసం మీరు మెక్సికోకో ఇండియాకో పోవటం నాకు ఇష్టం లేదు. ఇక్కడే అమెరికాలోనే మెరుగైన వైద్యం పొందేట్లు చూడాలనుకుంటున్నాను…ఇక్కడే ఖర్చు తగ్గించగలమేమో చూద్దాం”
వైద్యం అమెరికాలో చాలా ఖరీదయింది. సామాన్యులు భరించలేనిది. ఆరోగ్యానికి ఏడాదికి సగటున తలసరి ఖర్చు 8000 డాలర్ల పైమాటే. స్తూలజాతీయోత్పత్తిలో ఈమొత్తం 17.6 శాతం. ఇంతఖర్చు ఏదేశంలోనూ కాదు.అయినా ఆయుః ప్రమాణంలో అమెరికా రాంకు 36. అందరికీ ఆరోగ్యం అందించే స్తితిలో అగ్రరాజ్యం లేదు. ఎన్నోదేశాలకంటే వెనకబడి ఉంది.
మరి ఒబామా ఎలా మాట నిలుపోగలడు?
మొత్తం చదవండి

అమ్మ పాలతో ఐస్‌క్రీం

మార్చి 29, 2011

అమ్మ పాలతో ఐస్‌క్రీం

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »

ఉద్యోగుల ఆత్మహత్యలు- ఫ్రాన్స్ టెలికాం

అక్టోబర్ 26, 2010

ఉద్యోగుల ఆత్మహత్యలు- ఫ్రాన్స్ టెలికాం

గనులను జాతీయం చేస్తే–అమ్మోఎంతమాట!

అక్టోబర్ 6, 2010

గనులను జాతీయం చేస్తే ప్రజలకు రెండుపూటలా నేరుగా క్యారీయర్లే ఇంటికి పంపొచ్చు — జె.సి.దివాకరరెడ్డి
సంస్కరణ స్మరణ మన్మోహన్ సింగ్‌కి ప్రాణం. అన్ని ప్రైవేటికరించాలని చూస్తుంటే ప్రైవేట్ పరమయిన గనుల్ని తిరిగి ప్రభుత్వం ప్రజలపరం చేస్తుందా? …… చంద్రమండలంలొ గనులు లభిస్తే లాభించేది మైనింగ్ మాఫియాలూ, అధికారపార్టిల నాయకులూ. దేశాలకు ఆదాయం రానివ్వరు. అంతేకాదు, అక్కడ జరగబోయేదీ ప్తైవేట్ అక్రమ మైనింగే
మొత్తం చదవండి

బి.ఎస్.ఎన్.ఎల్ ప్రైవేటీకరణ

ఆగష్టు 13, 2010

పిట్రోడా సిఫారసులు
30 శాతం వాటా అమ్మాలి.
3 లక్షల మంది ఉద్యోగుల్లో 1 లక్షమందిని స్వచ్చంద పదవీ విరమణ లాంటి పధకాలుపెట్టి రిటైర్ చేయించాలి
9 కోట్లా 30 లక్షల లైన్లతో జి.ఎస్.ఎం. మొబైల్ నెట్ వర్క్‌ని 35 వేల కోట్ల ఖర్చుతో విస్తరించాలనే ప్రతిపాదనకు స్వస్తి చెప్పాలి. పరికరాల ఆర్డర్లని ఆపివేయాలి. నెట్‌ వర్క్‌ని ఔట్ సోర్సింగ్‌ చేసుకోవాలి.
సంస్తకున్న కాళీ భూముల్ని వాణిజ్య పరంగా వాడుకోవాలి. ఆపని చెయ్యటానికి ఒక రియల్ ఎస్టేట్ సంస్తని ఏర్పరచాలి- అదీ ప్రైవేట్ భాగస్వామ్యంతో
మొత్తం చదవండి

అమెరికా స్తబ్ద దశాబ్దం

జూన్ 3, 2010

జపాన్ 19 ఏళ్ళు స్తబ్దత లో మగ్గింది..
అమెరికా ఎకానమీ 1999 చివర నుంచీ 2009 చివరవరకూ పదేళ్ళు ఏమాత్రం ఎదగలేదు.
మాంద్యాలని చరిత్ర రికార్డ్ చేసింది.1930 దశకపు మహాసంక్షోభం ప్రపంచాన్ని గడగడలాదించింది. 1854 నుంచీ 2001 వరకూ ఎన్.బి.ఇ.ఆర్ ప్రకారం అమెరికాలో 32 మాంద్యాలొచ్చాయి. నడుస్తున్నది 33 వది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది 11 వది.
ఉద్దీపన మహా సంక్షోభాన్ని వెనక్కి తిప్పలేక పోయింది. జపాన్ని స్తబ్దదశాబ్దం పాలు కాకుండా కాపాడలేక పోయింది.కూరుకున్న అమెరికా ఎకానమీ బండిని ముందుకు నెట్టలేక పోతొంది.
మరేదైనా మార్గముందా? మాంద్యాలకి కారణం ఏమిటి? ఇవిరాకుండాఉండాలంటే ఏమిచెయ్యాలి? కమ్మ్యూనిస్ట్ ప్రణాళికలో ఏముందో చదవటానికిది సమయం. ‘ కాపిటల్ ‘ పుస్తకంలో మార్క్స్ సంక్షోభాల గురించి రాసిన విషయాల్ని చర్చించటానికిది సరైన సందర్భం.
మొత్తం చదవండి…

మాంద్యంలో సైతం సామాన్యులకి సంక్షోభం- సంపన్నులకి సంక్షేమం

ఏప్రియల్ 3, 2010

2010 ఫిబ్రవరిలో ఇంతకుముందు ఇతరులు తీయని లెక్కలు చూపుతూ ఒక నివేదిక వెలువడింది. అది ఆదాయ వర్గాల వారీగా అమెరికా నిరుద్యోగాన్ని విశ్లేషించింది. ఇదే ఫిబ్రవరిలో బూరో ఆఫ్ లేబర్ శ్టాటిస్టిక్స్ నివేదిక జనవరిలో పోయిన 20 వేల ఉద్యోగాలగురించి చెప్పటంతోపాటు 2009 మొత్తంలో పోయిన వాటిని సవరించింది. వివరాల్లోకి పోతే సామాన్యుడు దిమ్మర పోవలసిందే. అమెరికాలో 2008 లో మొత్తం 36 లక్షలా23 వేల ఉద్యోగాలు పోయాయి. అంతకుమించి 2009 లో 47 లక్షలా 81 వేలు పోయాయి. తొలి అంచనాలని బట్టి ఆ రెండేళ్ళలో పోయినవి 72 లక్షలనుకున్నారు. అయితే 2010 ఫిబ్రవరి 5 న బూరో ఆఫ్ లేబర్ శ్టాటిస్టిక్స్ (B.L.S) ఉద్యోగ నివేదక వచ్చాక మరో 12 లక్షలు పెరిగి 84 లక్షలయ్యాయి. ఇవన్నీ మళ్ళీ వస్తాయనే నమ్మకం ఎవ్వరికీ లేదు. చాలావరకూ శాశ్వతంగా పోయినట్లే….
మొత్తం చదవండి


Follow

Get every new post delivered to your Inbox.